ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాపై పోరుకు నారా రోహిత్​ రూ.30 లక్షలు వితరణ - Nara Rohith donation for corona

కరోనా అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.30 లక్షలు విరాళం ఇచ్చినట్లు హీరో నారా రోహిత్​ ప్రకటించారు. అందరం సమిష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమి కొడదామని ఆయన పిలుపునిచ్చారు.

కరోనాపై పోరుకు నారా రోహిత్​ రూ.30 లక్షలు
కరోనాపై పోరుకు నారా రోహిత్​ రూ.30 లక్షలు

By

Published : Mar 31, 2020, 6:38 AM IST

కరోనా మహమ్మారిపై యుద్దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సినీ నటుడు నారా రోహిత్ పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన చెరో రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి మరో రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ప్రజలంతా ప్రభుత్వ సూచనల మేరకు లాక్​డౌన్​ పాటించాలని కోరారు. మనం పాటించే స్వీయ నియంత్రణ మనకు శ్రీ రామరక్ష అని అభిప్రాయపడ్డారు. అందరం సమిష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమి కొడదామని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:మరో రూ.50 లక్షలు విరాళమిచ్చిన డార్లింగ్ ప్రభాస్

ABOUT THE AUTHOR

...view details