ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముప్పై ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలి: నారా లోకేశ్ - lokesh letter to alla nani

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వపరంగా పటిష్ఠ చర్యలు చేపట్టాలన్నారు. 30 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

nara lokesh
నారా లోకేశ్

By

Published : Apr 19, 2021, 7:34 PM IST

కరోనా టీకా ఇచ్చే వయస్సు పరిమితిని 30ఏళ్లకు కుదించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. కరోనా రెండో దశ నియంత్రణకు ప్రభుత్వపరంగా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి లేఖ రాశారు. బహిరంగ ప్రదేశాల్లో ముగ్గురికి మించి ఉండకుండా నియంత్రించటంతో పాటు చిరు వ్యాపారులకు నష్టం కలుగుకుండా తగు ప్రత్యామ్నాయాలు కల్పించాలన్నారు. మాస్క్ ధరించేలా అవగాహన కల్పించేందుకు, మాస్క్ పెట్టుకోని వారిని చైతన్యపరిచేందుకు ప్రత్యేక స్క్వాడ్ బృందాలను నియమించాలన్నారు. రక్తనిధి కేంద్రాల్లో తగినంత రక్తం నిలువ ఉండేలా చూడాలని పేర్కొన్నారు.

వలస కూలీలకు ఆకలి బాధలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్​వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల డిమాండ్​కు తగ్గట్టుగా కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని హితవు పలికారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 5,963 కేసులు, 27 మరణాలు

ప్రకాశం జిల్లాలో పిడుగులు.. విపత్తుల శాఖ హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details