ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఇలవేల్పు, ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవమైన శ్రీకాకుళం జిల్లా(srikakulam district)లోని పాతపట్నం శ్రీ నీలమణి దుర్గమ్మ ఆలయంలో ప్రహరీతో పాటు, సింహద్వారాన్ని కూల్చివేయటం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో హిందూధర్మం మంటగలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగాయని ధ్వజమెత్తారు.
Nara Lokesh: 'జగన్ రెండున్నరేళ్ల పాలనలో హిందూధర్మం మంటగలిసింది' - జగన్పై నారా లోకేశ్ విమర్శలు
శ్రీకాకుళం జిల్లా(srikakulam district) పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గమ్మ ఆలయ ప్రహరీతో పాటు సింహద్వారాన్ని కూల్చివేయటంపై నారా లోకేశ్(nara lokesh) మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దలకు తెలిసి చేసిన విధ్వంసమేనని నారా లోకేశ్ విమర్శించారు. జగన్‌రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో హిందూధర్మం మంటగలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
nara lokesh
రోడ్ల విస్తరణ పనుల పేరుతో దేవాలయాలను కూల్చేయడం చూస్తే.. హిందూ దేవాలయాల పట్ల ప్రభుత్వ పెద్దలకు ఎంత నిర్దయ ఉందో అర్ధమవుతోందని నారా లోకేశ్ (nara lokesh) అన్నారు. ఆలయాల ధ్వంసంపై వైకాపా ఎమ్మెల్యేకు సమాచారమిచ్చినా... పట్టించుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దలకు తెలిసి చేసిన విధ్వంసమేనని నారా లోకేశ్(nara lokesh) విమర్శించారు.
ఇదీ చదవండి