ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బడన్నపల్లిలో యువతి హత్య తీవ్రంగా కలిచి వేసింది: నారా లోకేశ్ - నారా లోకేశ్ వార్తలు

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో యువతి హత్య తీవ్రంగా కలిచివేసిందని నారా లోకేశ్ అన్నారు. యువతి తల్లి పడుతున్న బాధ వర్ణణాతీతమని విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

nara lokesh tweets on murder attempt occured at badannapally in ananthapur district
బడన్నపల్లిలో యువతి హత్య తీవ్రంగా కలిచివేసిందంటూ నారా లోకేశ్ ట్వీట్

By

Published : Dec 23, 2020, 6:59 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో యువతి హత్య.. తీవ్రంగా కలిచి వేసిందంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటం వల్లే తన బిడ్డ హత్యకు గురైందంటూ.. ఆమె తల్లి పడుతున్న బాధ వర్ణణాతీతమని విచారం వ్యక్తం చేశారు.

జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. మహిళల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ మొద్దునిద్ర వల్లే అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. యువతిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని.. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

బడన్నపల్లిలో యువతి హత్య తీవ్రంగా కలిచివేసిందంటూ నారా లోకేశ్ ట్వీట్
బడన్నపల్లిలో యువతి హత్య తీవ్రంగా కలిచివేసిందంటూ నారా లోకేశ్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details