రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం తనకు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. సీఎం జగన్ ఒక్కరోజైనా కాలు బయటపెట్టి బాధితుల గోడు విన్నారా..? అని ట్విట్టర్ వేదికగా లోకేశ్ ప్రశ్న్రించారు.
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునిగాయని... రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని పేర్కొన్న ఆయన.. సీఎంకి వరదలు, బురద అంత అసహ్యం కలిగిస్తున్నాయా.. అని దుయ్యబట్టారు.