ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిరుద్యోగులను మోసం చేసిన సీఎం జగన్​రెడ్డిని అరెస్ట్​ చేయాలి: లోకేశ్ - నిరుద్యోగుల అక్ర‌మ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం

జాబ్​ క్యాలెండర్​తో నిరుద్యోగులను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్​ను అరెస్ట్​ చేయాలని చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

lokesh serious on unemployees illegal arrest
నిరుద్యోగుల అక్ర‌మ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం

By

Published : Jun 30, 2021, 5:16 PM IST

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగుల అక్ర‌మ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. కొత్త జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విజయవాడలో ఆందోళ‌న‌ చేపట్టిన నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.

"ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాన‌ని.. వంద‌ల ఉద్యోగాల‌కే నోటిఫికేష‌న్ ఇచ్చి మోసం చేసిన‌ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన నిరుద్యోగుల్ని త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలి. జగన్​ పాలనలో త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై శాంతియుతంగా నిర‌స‌న తెల‌ప‌డం కూడా నేరంగా ప‌రిగ‌ణించ‌డం దారుణం" అని ట్విట్టర్ ద్వారా లోకేశ్ ధ్వజమెత్తారు.

నిరుద్యోగులను మోసం చేసిన సీఎం జగన్ రెడ్డిని కూడా అరెస్ట్​ చేయాలి: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details