తమపైన, తమ కార్యాలయాలపైన దాడిచేసిన వాళ్లల్లో ఒక్కరినైనా డీజీపీ అరెస్ట్ చేశారా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(naralokesh) నిలదీశారు. శాంతియుతంగా నిరసన తెలిపే తెదేపా నేతల్ని అరెస్ట్ చేస్తారా అంటూ దుయ్యబట్టారు. తమ నాయకులు పట్టాభి, నాదెండ్ల బ్రహ్మం.. ఇలా అరెస్టు చేసుకుంటూపోతే తెలుగుదేశం పార్టీలో 70 లక్షల మందిని అరెస్ట్ చేయాలన్నారు.
Lokesh: నాదెండ్ల బ్రహ్మంపై ఈగ వాలినా డీజీపీనే బాధ్యత వహించాలి: లోకేశ్ - నారాలోకేశ్ తాజావార్తలు
నాదెండ్ల బ్రహ్మంపై ఈగ వాలినా డీజీపీనే బాధ్యత వహించాలని నారా లోకేశ్ తెలిపారు. తమపైన, తమ కార్యాలయాల పైన దాడి చేసిన వారిలో ఒక్కరినైనా అరెస్టు చేశారా అని ఆయన నిలదీశారు.
నారాలోకేశ్
కొత్త డ్రామా..
పోలీసులు నాదెండ్ల బ్రహ్మంని నిన్నటి నుంచి స్టేషన్ల చుట్టూ తిప్పి..తిప్పి ఏదో చేయాలనే ప్లాన్ చేశారని...అది బెడిసికొట్టడంతో కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. నాదెండ్ల బ్రహ్మంపై ఈగ వాలినా డీజీపీనే బాధ్యత వహించాలన్నారు. చట్టాన్ని అతిక్రమించి చేసిన ప్రతీ అరెస్టుకి, పాల్పడిన ప్రతీ అరాచకానికీ న్యాయస్థానాల ముందు తలదించుకుని దోషిగా నిలబడేందుకు సిద్ధంగా ఉండాలని లోకేశ్ హెచ్చరించారు.