రాజ్యాంగం కల్పించిన హక్కులను, స్వేచ్ఛను, అధికారాన్ని అనుభవిస్తూ... ఆ రాజ్యాంగాన్నే ధిక్కరించడం అంటే తల్లి పాలను వెక్కిరించడమేనని లోకేష్ విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తోన్న దేశ ద్రోహులకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో లోకేశ్, ఆయన తనయుడు దేవన్ష్తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించి గణతంత్ర వేడుక నిర్వహించారు.
దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్ - హైదరాబాద్లో గణతంత్ర దినోత్సవం వార్తలు
దేశ ప్రజలందరికీ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరించారు.
దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు:లోకేశ్