గుంటూరులో రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. చివరికి పెదకాకాని పీఎస్ నుంచి విడుదల చేశారు. కొన్ని నోటీసులపై సంతకం పెట్టించుకుని ఆయనను విడిచిపెట్టారు. లోకేశ్‌పై 151 సీఆర్పీసీ కింద పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
LOKESH RELEASED: పెదకాకాని పీఎస్ నుంచి నారా లోకేశ్ విడుదల - నారా లోకేశ్
NARA LOKESH RELEASED
20:18 August 16
NARA LOKESH RELEASED
ప్రత్తిపాడు పీఎస్ నుంచి లోకేశ్‌ను తన కాన్వాయ్‌లోనే గోప్యంగా పోలీసులు తరలించారు. ఆ తరువాత పెదనందిపాడు, పొన్నూరు, గుంటూరు మీదుగా పెదకాకాని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు చాలా సేపు పొన్నూరు చుట్టుపక్కల డొంక రోడ్డుల్లో తిప్పారు.
ఇదీ చదవండి:
Last Updated : Aug 16, 2021, 9:11 PM IST