ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LOKESH: ఎమ్మెల్సీ డ్రైవరుది హత్యే.. కేసు సీబీఐకి అప్పగించాలి : లోకేశ్‌ - తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

LOKESH: ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశారని సుబ్రహ్మణ్యం కుంటుంబ సభ్యులు అంటున్నా.. ఎమ్మెల్సీ అనంత బాబుని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు.

LOKESH
తన డ్రైవర్‌ను ఎమ్మెల్సీ ఉదయ్‌ భాస్కర్‌ హత్య చేశారు

By

Published : May 20, 2022, 11:19 AM IST

LOKESH: ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశారని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా.. ఎమ్మెల్సీ అనంత బాబుని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ఆంధ్ర ప్రదేశ్ ను బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా వైకాపా మాఫియా మార్చేసిందని ఆక్షేపించారు.

LOKESH

వైకాపా నాయకుల నేరాలు, ఘోరాలకు సామాన్యులు బలైపోతున్నారని మండిపడ్డారు. డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంను అత్యంత దారుణంగా హత్య చేసి.. ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోందని ఆగ్రహం ఆరోపించారు. వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? అని లోకేశ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఎంతో భవిష్యత్ ఉన్న కుమారుడ్ని కోల్పోయిన తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details