Nara Lokesh Palnadu Tour: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. రావులాపురం గ్రామంలో ఇటీవల హత్యకు గురైన తెదేపా కార్యకర్త కంచర్ల జల్లయ్య కుటుంబసభ్యుల్ని పరామర్శించి వారికి రూ.25లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. పార్టీ కేంద్ర కార్యాలయం మీదుగా ఉదయం బయలుదేరి.. గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి మీదుగా బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామనికి లోకేశ్ చేరుకుంటారు. అక్కడ జల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈనెల మొదటి వారంలో తెలుగుదేశం కార్యకర్త జల్లయ్యను ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు.
Lokesh Tour: పల్నాడు జిల్లాలో నారా లోకేశ్ పర్యటన.. జల్లయ్య కుటుంబానికి పరామర్శ - lokesh palnadu tour news
నేడు పల్నాడు జిల్లాలో తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పర్యటించనున్నారు. రావులాపురంలో ఇటీవల హత్యకు గురైన కంచర్ల జల్లయ్య కుటుంబసభ్యులకు రూ.25లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు.
![Lokesh Tour: పల్నాడు జిల్లాలో నారా లోకేశ్ పర్యటన.. జల్లయ్య కుటుంబానికి పరామర్శ Nara Lokesh Palnadu Tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15632265-340-15632265-1655916336201.jpg)
Nara Lokesh Palnadu Tour