ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్వరలో యూనిఫామ్​నూ​ వైకాపా రంగులో మార్చేలా ఉన్నారు: లోకేశ్ - పోలీసు వాహనాలకు వైసీపీ రంగులు న్యూస్

పోలీసు వాహనాలకు వైకాపా రంగులు వేయడంపై నారా లోకేశ్ స్పందించారు. మహిళలకు భద్రత కల్పించడంపై పోలీసులు దృష్టి పెట్టాలని ట్వీట్ చేశారు.

lokesh on ysrcp colours to police vehicles
lokesh on ysrcp colours to police vehicles

By

Published : Dec 21, 2020, 3:54 PM IST

పొలీసు వాహనాలకు వైకాపా రంగులా!పైగా పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసం. కొంత మంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే.. త్వరలో యూనిఫామ్ కూడా వైకాపా రంగులోకి మార్చేసేలా ఉన్నారు. రంగులతో మహిళలకు రక్షణ రాదు, మూడు రంగుల మదంతో రోడ్ల మీద పడి మహిళల్ని వేధిస్తున్న మృగాళ్లను శిక్షిస్తే మహిళలు ధైర్యంగా బయటకు రాగలుగుతారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో అవి వైకాపా రంగులు కాదు.. శాంతికి చిహ్నాలు అంటూ సమయం వృథా చెయ్యకుండా మహిళలకు భద్రత కల్పించడంపై పోలీసులు దృష్టి పెడితే మంచిది.

- నారా లోకేశ్, తెదేపా ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి:సామాన్యుల ప్రయోజనాలు కాపాడేందుకే.. భూ సర్వే: సీఎం

ABOUT THE AUTHOR

...view details