Lokesh on VOA Nagalaxmi Suicide: 'వీవోఏ నాగలక్ష్మిది ఆత్మహత్య కాదు.. జగన్ రెడ్డి పార్టీ నేత చేసిన హత్య' అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి వీవోఏ నాగలక్ష్మి.. తాము చెప్పినట్టు వినడంలేదని వైకాపా నేత నరసింహారావు వెంటాడి వేధించడంపై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఆమె బలవన్మరణానికి పాల్పడేది కాదన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా వైకాపా నేత నుంచి మహిళను రక్షించలేకపోయారంటే.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతగా భ్రష్టు పట్టిందో తెలుస్తుందని లోకేశ్ విమర్శించారు. ముఖ్యమంత్రి.. మీకు ఓట్లేసి గెలిపించింది ప్రజలకి రక్షకులుగా ఉంటారని.. ప్రజల్నే భక్షిస్తారని కాదని ధ్వజమెత్తారు.
సొంత చెల్లెలిని తెలంగాణ తరిమేసి, బాబాయ్‌ను చంపేసి ఆయన కుమార్తె ప్రాణాలకు రక్షణలేకుండా చేసిన జగన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుని గ్రామస్థాయిలోనూ వైకాపా నేతలు మహిళల ప్రాణాలు తీసేస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని చుట్టంగా చేసుకున్న వైకాపా నేతల అరాచకాలకు పోలీసులకు అండగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలంతా కలిసి తిరుగుబాటు చేయాలని.. అప్పుడే ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ దొరుకుతుందని లోకేశ్ స్పష్టం చేశారు.
ఆ నిజం ముఖ్యమంత్రికి తెలియదా..?: సునీత