"ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రకియను వైకాపా కాలకేయులు దాడులతో యుద్ధంగా మార్చారు" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. "ఈ అరాచక పోరాటంలో గెలిచిన తెదేపా మద్దతుదారులు ఒక్కొక్కరూ ఒక్కో బాహుబలి" అని అభివర్ణించారు.
"జగన్‌రెడ్డి అధికారం అండతో, అధికారులు ప్రేక్షకులై చూస్తుంటే, వీరుల్లా పోరాడారు. వైకాపా బలవంతపు ఏకగ్రీవాల కంటే తెదేపా మద్దతుదారులు సాధించిన విజయాలు తక్కువగా ఉన్నా.. అసలు సిసలైన గెలుపు మాదే" అని లోకేశ్ ట్వీట్ చేశారు.