రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్న జగన్ రెడ్డికి పాలించే అర్హత ఉందా అని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. చేతగాని మంత్రులు దీనికి సమాధానం చెప్పాలని ఆక్షేపించారు. 48 గంటల వ్యవధిలోనే గుంటూరు జిల్లాలో శ్రీ హరిబాబు, ప్రకాశం జిల్లాలో రమేశ్ ఆత్మహత్య చేసుకోవటం తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
'రైతుల ప్రాణాలు బలి తీసుకుంటున్న జగన్‌కు పాలించే అర్హత లేదు'
రాష్ట్రంలో 18 నెలల్లో 468 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. రైతుల కష్టాలను, ఆత్మహత్యలను మంత్రులు అపహాస్యం చేస్తూ మాట్లాడటం దారుణమని మండిపడ్డారు.
రైతుల ప్రాణాలు బలి తీసుకుంటున్న జగన్‌కు పాలించే అర్హత లేదు: లోకేశ్
జగన్ రెడ్డి విధానాల వల్లే దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఈ దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనన్న లోకేశ్... తనపై విమర్శలు చేస్తున్న మంత్రులు చనిపోయిన రైతులను తిరిగి తీసుకురాగలరా? అని నిలదీశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:పోలవరం ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గదు: సీఎం జగన్