ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Nara Lokesh: అది మూమ్మటికీ ప్రభుత్వ హత్యే.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి: లోకేశ్

Nara Lokesh On Farmer Death Incident: చెరకు రైతుల పట్ల ప్రభుత్వ తీరు దారుణమని నారా లోకేశ్ మండిపడ్డారు. బిల్లులు చెల్లించాల‌ని నిరసన తెలిపితే రైతులపై దాడులు చేస్తారా? అని నిలదీశారు. విశాఖ జిల్లాలో కౌలురైతు నానాజీది మూమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు.

లోకేశ్
లోకేశ్

By

Published : Dec 24, 2021, 4:55 PM IST

Nara Lokesh On Farmer Death Incident: బకాయిలు విడుదల చేయాలని ఆందోళనకు దిగిన చెరుకు రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. గతంలో విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్​సీఎస్ చక్కర పరిశ్రమ వద్ద ధర్నా చేసిన రైతులను చావబాదిన పోలీసులు.. వారిపై అక్రమ కేసులు పెట్టారన్నారు.

ముఖ్యమంత్రి జగన్ మూర్ఖపు చర్య వల్ల ఇప్పుడు విశాఖ జిల్లా తాండవ షుగర్ ఫ్యాక్టరీ కౌలు రైతు ప్రాణాలు కోల్పోయాడన్నారు. దాదాపు రూ.10 కోట్లు బకాయిలు చెల్లించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు క్రూరంగా ప్రవర్తించారన్నారు. పోలీసుల అత్యుత్సాహంతోనే కౌలు రైతు నానాజీ మృతి చెందారని ఆరోపించారు.

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని..,నానాజీ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెరకు రైతుల బిల్లులు త‌క్షణ‌మే చెల్లించి, రైతు స‌మ‌స్యల‌ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి

Farmer died in clash: బకాయిల విడుదల కోరుతూ చేపట్టిన ధర్నాలో తోపులాట.. రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details