LOKESH LETTER: వినాయక పండగకు విఘ్నాలు కల్పించడం సరికాదు: లోకేశ్ - No public celebrations on Ganesh Puja
18:33 September 06
సీఎం జగన్‌కు నారా లోకేశ్ బహిరంగ లేఖ
విఘ్నాలు తొలగించే వినాయకుడి ఉత్సవాలకే విఘ్నాలు కల్పించడమేంటని రాష్ట్రప్రభుత్వాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. కరోనా నిబంధనల మధ్య వినాయక చవితి వేడుకలు జరుపుకునేలా అనుమతులివ్వాలని డిమాండ్ చేస్తూ.. సీఎంకు బహిరంగ లేఖ రాశారు.
"భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో మాత్రమే మరెక్కడా లేని నిబంధనలు పెట్టడం అర్థరహితం. కరోనా తీవ్రత సమయంలోనే మద్యం అమ్మకాలు విచ్చల విడిగా జరిపారు. ఎలాంటి కొవిడ్ నిబంధనలు పాటించకుండానే అన్ని నియోజకవర్గాల్లో దివంగత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని జనసమీకరణతో నిర్వహించారు. మీ 25వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా హడావుడి చేశారు. మీ కార్యక్రమాలకు అడ్డురాని కొవిడ్ నిబంధనల పేరుతో మతసామరస్యాన్ని దెబ్బతీయొద్దు" అని నారా లోకేశ్.. లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి..