ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LOKESH ON CID: సీఐడీకి సరికొత్త అర్థం చెప్పిన లోకేష్.. జగన్ అలా మార్చేశారంట!

NARA LOKESH ON CID: రాష్ట్రంలో సీఐడీని.. సీఎం ఇంట్రెస్ట్ డిపార్ట్‌మెంట్‌గా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ విమర్శించారు. "ఆంధ్రజ్యోతి" ఎండీ రాధాకృష్ణపై త‌ప్పుడు కేసు బ‌నాయించిన‌ సీఐడీ.. ఏపీ ప‌రువును తెలంగాణ న‌డివీధిలో తీసి వేసిందని దుయ్యబట్టారు.

nara lokesh
నారా లోకేశ్​

By

Published : Dec 13, 2021, 2:35 PM IST

NARA LOKESH ON CID: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ​.. సీఐడీని సీఎం ఇంట్రెస్ట్ డిపార్ట్‌మెంట్‌గా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ విమర్శించారు. త‌న మిత్రుడైన‌ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణను పరామర్శించేందుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై త‌ప్పుడు కేసు బ‌నాయించిన‌ సీఐడీ.. ఏపీ ప‌రువును తెలంగాణ న‌డివీధిలో తీసి వేసిందని దుయ్యబట్టారు. విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరిన సీఐడీ అధికారులే.. విచార‌ణ‌కి ఆటంకం క‌లిగించార‌ని రాధాకృష్ణపై 36 గంట‌ల త‌రువాత ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం పూర్తిగా కుట్రపూరితం అన్నారు.

CID Case Register on ABN Radhakrishna: ఇప్పటికే జీవో 2430 తెచ్చి మీడియా గొంతు కోసిన జగన్ రెడ్డి.. ఇప్పుడు రాధాకృష్ణను అక్రమ‌కేసులో ఇరికించేందుకు ఉద్దేశ‌పూర్వకంగా ప్రయత్నిస్తున్నారని లోకేశ్​ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రోద్భలంతోనే సీఐడీ ఇలాంటి త‌ప్పుడు కేసుల‌ు నమోదు చేస్తోందన్న లోకేశ్​.. అక్రమ కేసులను ఇప్పటికైనా అపేయాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి సంబంధంలేని రాధాకృష్ణపై బ‌నాయించిన అక్రమ‌ కేసును.. వెంట‌నే ఎత్తేవేయాలని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details