ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

lokesh: 'జగన్ పాలనలో విశ్వవిద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి' - వైకాపాపై మండిపడ్జ నారా లోకేశ్

రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలను.. జగన్ రెడ్డి పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని నారా లోకేశ్ మండిపడ్డారు. 11 కేసుల్లో నిందితుడుగా ఉన్న A2 రెడ్డి జన్మదిన వేడుకలు.. ఆంధ్ర విశ్వవిద్యాయలంలో నిర్వహించటం దారుణమన్నారు.

nara lokesh fires on ycp over andhra university issue
జగన్ పాలనలో విశ్వవిద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి: లోకేశ్‌

By

Published : Jul 2, 2021, 5:36 PM IST

రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు.. జగన్ రెడ్డి పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన చరిత్ర ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉందని.. అలాంటి చోట, 11 కేసుల్లో నిందితుడుగా ఉన్న A2 రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం దారుణమన్నారు. దొంగల జీవితాలను ఆదర్శంగా తీసుకోమని బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులకు.. వీసీ స్వయంగా చెప్పటం దురదృష్టకరమని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details