ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lokesh: 'దళిత యువకుడిని చంపి ఏడాదైనా నిందితులపై చర్యలు లేవు' - nara lokesh latest news

మాస్క్ పెట్టుకోలేదని దళిత యువ‌కుడు కిరణ్​ కుమార్​ను..ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు కొట్టి చంపిన ఘటనకు ఏడాదైనా నిందితులపై చర్యలు తీసుకోలేదని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. బాధిత కుటుంబానికి రూ. 50లక్షలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

nara lokesh fires on ycp
ఎస్సీ యువకుడిని చంపి ఏడాదైనా నిందితులపై చర్యలు లేవు: లోకేశ్

By

Published : Jul 21, 2021, 4:55 PM IST



ప్రకాశం జిల్లా చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని దళిత యువ‌కుడు కిర‌ణ్‌కుమార్​ను.. పోలీసులు కొట్టి చంపి ఏడాదయినా నిందితులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. బాధిత కుటుంబానికి రూ. 50లక్షలు పరిహారం ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

"ఎస్సీలంటే జగన్ రెడ్డికి ఎందుకింత క‌క్ష. త‌ల్లి ,తండ్రి, చెల్లెళ్లల్ని కంటికి రెప్ప‌లా కాపాడే కిర‌ణ్‌ని వైకాపా సెక్ష‌న్ కింద‌ కిరాత‌కంగా చంపడానికి బులుగు ఖాకీలకు మ‌న‌సెలా ఒప్పింది. జ‌గ‌న్‌రెడ్డి ఫ్యాక్ష‌న్ పాల‌న‌లో ఎస్సీలకు బ‌తికే హ‌క్కులేదా. మాస్క్ పెట్టుకోక‌పోవ‌డం నేర‌మైతే, రోజూ మాస్క్ పెట్టుకోని జ‌గ‌న్‌రెడ్డికి ఏ శిక్ష విధిస్తారు. కిరణ్ హ‌త్య వెనుకున్న కార‌ణాల‌పై ద‌ర్యాప్తు జరిపి హంత‌కులైన ఎస్ఐ, కానిస్టేబుళ్ల‌ను శిక్షించాలి."-నారా లోకేశ్.

కిరణ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అతని కుటుంబ సభ్యుల ఆవేదనకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ కు జత చేశారు.

ఇదీ చదవండి:

Police-Maoist firing: విశాఖ అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details