ఒక్క అవకాశం ఇస్తే.. ఉన్న కంపెనీలు పోయాయి: నారా లోకేశ్ - latest news on nara lokesh
సీఎం జగన్‌కి ఒక్క అవకాశం ఇస్తే... ఉన్న కంపెనీలు, ఉద్యోగాలు పోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని యువ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
టీఎన్ఎస్ఎఫ్ సదస్సు
అభివృద్ధి వికేంద్రీకరణను గడచిన ఐదేళ్లలోనే తెదేపా చేసి చూపిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. టీఎన్ఎస్ఎఫ్ సదస్సు ఆయన మాట్లాడారు. వైకాపా నేతలు విశ్వవిద్యాలయాలను రాజకీయ వేదికగా మార్చేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా యాజమాన్యాన్ని వైకాపా ఎంపీ బెదిరించినందుకే... పక్క రాష్ట్రాలకు తరలివెళ్లే యోచనలో ఆ సంస్థ పడిందన్నారు.