దిశ చట్టం పేరుతో ఇంతకాలం మోసగించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. మాయమాటలతో మహిళలకు రక్షణ కల్పించలేరని అన్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయనే అహంకారంలో ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ సుబ్బారెడ్డి ఉద్యోగినులను వేధించడం రాష్ట్రంలోని మహిళల భద్రత కొరవడడాన్ని అద్దం పడుతోందన్నారు.
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌కు మొరపెట్టుకునే స్థాయిలో వేధింపులు పెరిగాయని మండిపడ్డారు. ఎస్సీ విద్యార్థిని రమ్యను హత్య చేసినవాడికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకునేందుకు ఇక ఏడు పని దినాలే మిగిలాయని గుర్తు చేశారు.