మూడు రాజధానుల ఆలోచనలను సీఎం జగన్ పక్కనబెట్టి.. ఒకే పడకపై ఉన్న ముగ్గురికి మూడు బెడ్లు కేటాయించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఓ వీడియోను తన ట్వీట్‌కు జత చేశారు.
ఇదీ చదవండి:కరోనా నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది అరెస్ట్
"జగన్ గారూ! ఒక్కసారి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దయనీయ దృశ్యాలు చూడండి. కరోనా మృతదేహాలు, ఆ పక్కనే కొవిడ్ పేషెంట్లు, వారిని తీసుకొచ్చిన బంధువుల.. హృదయ విదారకంగా ఉంది. వరండాలోనే శవాలు, నేలపైనే పేషెంట్లు.. ఎవరు బతికున్నారో, ఎవరు చనిపోయారో తెలియని దుస్థితి. ప్రతిపక్ష నేతల్ని అక్రమ అరెస్టులు చేయించడంపై చేస్తున్న సమీక్షలు మాని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నేలపైనే కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రజల ప్రాణాలు కాపాడటంపై పెట్టండి. 104కి కాల్ చేస్తే 3 గంటల్లో బెడ్డు ఇవ్వాలని మీరంటారు. 104 యజమాని మామగారైన విశాఖ ఏ2 వైరస్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసినా వారెత్తరు. వ్యాక్సిన్ కొనడానికి డబ్బుల్లేవని చేతులెత్తేసి, చంద్రబాబు వ్యాక్సిన్ తెప్పించాలంటూ సలహాల జీతగాడు సజ్జల వాగుతున్నారు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మీ వాళ్లే నమ్మలేకపొతున్నారు. మీకు అర్థం అవుతోందా!! " అంటూ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
కరోనాతో ప్రాణాపాయ స్థితిలో బాలిక.. చికిత్స చేయించి మానవత్వం చాటుకున్న ఎస్సై