"ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణ ఆపాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసన.. రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమా?" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అనంతపురంలో ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల వద్ద.. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్(nara lokesh fire on police lathicharge at anantapur) చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దమనకాండ సాగించడం.. జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించడంతోపాటు, లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమాలు అణచివేయాలని చూస్తే.. గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన లోకేశ్(lokesh on aided schools)... ఎస్ఎస్బీఎన్ కళాశాల వద్ద దాడి ఘటన(police lathicharge on students at anantapur)కు సంబంధించిన దృశ్యాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
లోకేశ్ పరామర్శ...
విద్యార్థులపై లాఠీఛార్జ్‌ను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఖండించారు. ఇది జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన విద్యార్థినిని లోకేశ్ ఫోన్‌లో పరామర్శించారు. విద్యార్థులకు అండగా ఉంటామని ఆందోళన చెందవద్దని సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులను ఆదేశించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.