ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వింత రోగం వచ్చింది ప్రజలకు కాదు.. జగన్ రెడ్డికి: నారా లోకేశ్ - lokesh latest news

ఏలూరు ఘటనలో ప్రభుత్వ వైఖరిపై తెదేపా నేత నారాలోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతతోనే బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆరోపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వింత రోగం వచ్చింది ప్రజలకు కాదని.. జగన్ రెడ్డికి అని వ్యాఖ్యానించారు.

tdp leader lokesh on eluru incident
వింత రోగం వచ్చింది ప్రజలకు కాదు.. జగన్ రెడ్డికి: నారా లోకేశ్

By

Published : Dec 6, 2020, 10:58 PM IST

ముఖ్యమంత్రి జగన్​కు వింత రోగం వచ్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అసమర్థత ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఏలూరులో మాస్ హిస్టీరియా ప్రచారానికి తెరలేపిందని ఆరోపించారు.

వైద్యారోగ్యశాఖ మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్.. జగన్ నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అస్వస్థతకు గురవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

నగరంలోని విద్యానగర్​కు చెందిన శ్రీధర్ మృతి.. ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని.. మరింత మంది అస్వస్థతకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

వింత రోగం వచ్చింది ప్రజలకు కాదు.. జగన్ రెడ్డికి: నారా లోకేశ్

ఇదీ చూడండి:

ఏలూరులో ఏం జరుగుతోంది?... ప్రజల అస్వస్థతకు కారణమేంటి?

ABOUT THE AUTHOR

...view details