ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Nara Lokesh: 'ఆంధ్రప్రదేశ్‌ను అఫ్గానిస్థాన్‌ కంటే ఘోరంగా మార్చారు' - దిశ చట్టం వార్తలు

సీఎం జగన్ తన పాలనలో ఆంధ్రప్రదేశ్​ను అఫ్గానిస్థాన్ కంటే ఘోరంగా మార్చారని నారాలోకేశ్ విమర్శించారు. ఆడబిడ్డలను హత్య చేసిన నేరస్థులు 21రోజుల్లో బయటకొచ్చేయటమే దిశ చట్టం అమలా?అని నిలదీశారు.

Nara Lokesh
నారాలోకేష్

By

Published : Sep 9, 2021, 12:13 AM IST

ఏపీ సీఎం జగన్(cm jagan) తన అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను అఫ్గానిస్థాన్ కంటే ఘోరంగా మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) ఆరోపించారు. ఆడబిడ్డలను హత్య చేసిన నేరస్థులు 21రోజుల్లో బయటకొచ్చేయటమే దిశ చట్టం అమలా?అని నిలదీశారు.

‘‘హంతకుల్ని 21 రోజుల్లో శిక్షిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నేరస్థులు బయట తిరుగుతూ బాధితుల తల్లిదండ్రులను చంపుతామని బెదిరిస్తుంటే పట్టించుకునేవారు లేరు. 36 కేసుల్లో జైలుకెళ్లి బెయిల్‌పై బయట తిరుగుతున్న జగన్ తనలాంటి నేరస్థులు, ఆడబిడ్డల్ని చంపిన హంతకులు కూడా బయట ఉండాలనే ఆలోచనతో ఉన్నారా? కడప జిల్లా బద్వేలు మండలం చింతల చెరువులో శిరీషని చంపిన ఉన్మాదులు బెయిల్‌పై బయట తిరుగుతూ బాధితురాలి తల్లిదండ్రుల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. దీనిపై వారు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.

ప్రొద్దుటూరులో లావణ్యపై దాడి చేసిన నిందితుడూ బయట తిరుగుతూ మరో దాడి చేస్తానని హెచ్చరిస్తున్నాడు. పోలీసులు మాత్రం నేరగాళ్లకు మద్దతు తెలుపుతూ.. అందరికీ న్యాయం చేశామని చెప్తున్నారు. లావణ్య చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానన్న ప్రభుత్వం ఇంతవరకూ రూపాయి సాయం కూడా చేయలేదు. విశాఖలో వాలంటీర్ ప్రియాంకపై దాడిచేసిన నిందితుడు నెల రోజులు తిరగకుండానే బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. ఆడ పిల్లలను ఆదుకోవటమంటే సొంత మీడియాకు కోట్ల రూపాయల ప్రకటనలివ్వటం కాదు. దిశ చట్టం తెచ్చాక నేను పేర్కొన్న బాధిత మహిళల కుటుంబాలకు ఏం న్యాయం చేశారు? ఎస్సీ విద్యార్థిని రమ్యను చంపిన మృగాడికి ఏం శిక్ష విధించారో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. బాధిత కుటుంబాల పక్షాన తెదేపా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ -నారా లోకేశ్‌ , తెదేపా జాతీయ కార్యదర్శి

ఇదీ చదవండి

లోకేశ్‌ నరసరావుపేట పర్యటనకు అనుమతి లేదు: ఎస్పీ విశాల్ గున్నీ

ABOUT THE AUTHOR

...view details