ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీల్చే గాలికి పన్ను వసూలు చేస్తారేమో!: లోకేశ్ - పెట్రో పన్నుపై మండిపడ్డ లోకేశ్

అధికారంలోకి వచ్చాక ఒక్క రోడ్డు వేయని వైకాపా ప్రభుత్వం.. రోడ్డు అభివృద్ధి పేరిట పన్ను వసూలు చేయడం దారుణమని లోకేశ్ విమర్శించారు. పెట్రోల్, డీజిల్​పై అదనంగా రూ. 5 రూపాయలు వసూలు చేస్తూ ప్రజలపై ఏడాదికి రూ. 2500కోట్ల రూపాయల భారం వేశారని ఆక్షేపించారు.

nara lokesh criticises ycp government about petro cess
లోకేశ్

By

Published : Sep 19, 2020, 3:18 PM IST

లోకేశ్ ట్వీట్స్

పీల్చే గాలిపైనా జగన్ మోహన్ రెడ్డి శిస్తు వసూలు చేస్తారేమోనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుడి చేత్తో రూపాయి ఇచ్చి ఎడమ చేత్తో 10 రూపాయిలు తీసుకోవడమే జగన్ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మహత్యమని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క రోడ్డు వేయని వైకాపా ప్రభుత్వం.. రోడ్డు అభివృద్ధి పన్ను విధించడం ఘోరమని లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం కనీసం గుంతలు పూడ్చలేదని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల కంటే అధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్​పై అదనంగా రూ. 5 రూపాయలు వసూలు చేస్తూ ప్రజలపై ఏడాదికి రూ. 2500కోట్ల రూపాయల భారం వేశారని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details