ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళల రక్షణకు దిక్కు లేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవాచేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దిశ చట్టం పేరుతో హడావుడి చేయటం తప్ప ఇప్పటి వరకు ఒక్క బాధిత మహిళకూ న్యాయం జరగలేదన్నారు.
'సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది' - మహిళలపై దాడులు న్యూస్
కడప జిల్లా ప్రొద్దుటూరులో యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడటాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళల రక్షణకు దిక్కు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. మహిళల రక్షణ గాలికొదిలి రాజకీయ కక్ష సాధింపు కోసం పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేయటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
రాష్ట్రంలో ప్రతి నిత్యం మహిళలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని వాపోయారు. మహిళల రక్షణ గాలికొదిలి రాజకీయ కక్ష సాధింపు కోసం పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేయటం వల్లే ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతికి మెరుగైన వైద్యం అందించటంతో పాటు..మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మృగాళ్లను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇదీచదవండి:ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి