వైకాపా జెండా ఎత్తమంటూ ముక్కుపచ్చలారని పిల్లలతో ఆడించారని నారా లోకేశ్ విమర్శించారు. విద్యాశాఖ మంత్రి సాక్షిగా విద్యాలయాన్ని విషప్రచార నిలయం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాల‌్లో తెలుగుతల్లి గీతాలాపన రద్దు చేసి... వైకాపా పాటలు పెట్టేశారా అని నిలదీశారు లోకేశ్.
'ప్రభుత్వాన్ని వైకాపా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేస్తారా..?' - వైసీపీపై నారా లోకేశ్ విమర్శలు న్యూస్
ముఖ్యమంత్రి జగన్... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైకాపా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ఆరోపించారు. అమ్మఒడి ఇస్తున్నామని ప్రచారం చేసుకొని... వైకాపా బడులు చేస్తున్నారా...? అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు.
!['ప్రభుత్వాన్ని వైకాపా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేస్తారా..?' nara lokesh comments on ycp govt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5271038-589-5271038-1575477155813.jpg)
nara lokesh comments on ycp govt
ఇదీ చదవండి:వైకాపా విధానాలతో రాష్ట్రం దివాళా: చంద్రబాబు