Nara lokesh Latest News: బీహార్‌ని తలపించే విధంగా రాష్ట్రంలో గన్‌కల్చర్ రావడం దురదృష్టకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో యువతిపై ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతి కావ్యను సురేశ్ రెడ్డి కాల్చి చంపడం దారుణమని ఆక్షేపించారు. పెళ్లికి అంగీకరించలేదన్న నెపంతో యువతి బంగారు భవిష్యత్త్ను నాశం చేయడం హేమమైన చర్యగా పేర్కొన్నారు. ఆడబిడ్డలపై పెరిగిపోతున్న ఈ తరహా అఘాయిత్యాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీహార్ గన్ కల్చర్ దురదృష్టకరం: లోకేశ్ - Nara Lokesh on Woman Fired Incident in Nellore
Nara Lokesh on Woman Fired Incident in Nellore: నెల్లూరు జిల్లా తాటిపర్తిలో యువతిపై తుపాకీ కాల్పుల ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెదేపా నేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'బీహార్‌ని తలపించే విధంగా రాష్ట్రంలో గన్ కల్చర్ రావడం దురదృష్టకరం' అని లోకేశ్ ధ్వజమెత్తారు.
నెల్లూరు ఘటనపై లోకేశ్