"తన ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో ఒక యువతిని దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారనే సమాచారమైనా ముఖ్యమంత్రికి తెలుసా?" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. అమ్మాయికి అన్యాయం జరిగితే గన్ కంటే జగన్ ముందొస్తాడంటూ చెప్పిన పంచ్ డైలాగులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఇంటి దగ్గర ఇంత అన్యాయం జరిగుతుంటే ఆయన ఎక్కడున్నారని ధ్వజమెత్తారు. అమరావతి ఉద్యమానికి భయపడి వేలమంది పోలీసుల్ని కాపలా పెట్టుకున్నారని.. జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకమైందని లోకేశ్ దుయ్యబట్టారు.