రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలన్నీ మిస్టరీగానే మిగిలిపోతున్నాయని, అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వివర్శించారు. విశాఖ జిల్లా గాజువాక ఏరియా అగనంపూడిలో జరిగిన ఘటనపై లోకేష్ స్పందించారు.
బాలికపై అత్యాచారం చేసి క్రూరంగా చంపారనే అనుమానాలు బలపడుతుంటే.. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలు.. తప్పంతా బాలికదే అన్నట్టుగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇది ఆత్మహత్యే:బాలిక మృతి కేసు... ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు
విశాఖ పారిశ్రామిక ప్రాంతమైన అగనంపూడి(aganampudi) వద్ద జరిగిన మైనర్ బాలిక అనుమానాస్పద మృతి(suspiciious death) కేసును పోలీసులు ఆత్మహత్యగా తేల్చిన సంగతి తెలిసిందే. నరేశ్ అనే యువకుడితో శారీరక సంబంధమే ఆత్మహత్యకు కారణమైందని పోలీసులు తెలిపారు.
విజయనగరం జిల్లా కొత్తపేట సమీపంలోని గొల్లపేట(gollapeta) గ్రామానికి చెందిన నరేశ్(naresh).. ఉపాధి నిమిత్తం విశాఖలోని లంకెలపాలెంలో కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. శనివాడ గ్రామంలోని ఓ అపార్ట్మెంట్లో నరేశ్ నివాసం ఉంటున్నాడు. నరేశ్‌కు ఎదురుగా ఉన్న మరో అపార్ట్మెంట్లో ఉంటున్న బాలిక(girl)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నిందితుడు నరేశ్.. బాలికకు అశ్లీల వీడియోలు చూపిస్తూ లోబరచుకున్నట్లు సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. నరేశ్ అనే యువకుడితో బాలికకు శారీరక సంబంధం ఉందని సీపీ తెలిపారు. ఘటన జరిగిన రాత్రి కూడా ఇద్దరు శారీరకంగా కలిశారని, ఈ విషయం తండ్రికి తెలిస్తే ఏం జరుగుతుందోననే భయంతో బాలిక టెర్రస్(terros)పై నుంచి దూకి ఆత్మహత్య(suicide) చేసుకుందని సీపీ వివరించారు.
ఇదీ చదవండి:తొమ్మిదో తరగతి విద్యార్థినిపై క్లాస్మేట్ సోదరుడు అత్యాచారం