ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెన్నుచూప‌ని పోరాటంతోనే పంచాయ‌తీల్లో ప‌ట్టు సాధించాం:లోకేశ్ - Nara Lokesh challenges Jagan newsupdates

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా పెద్దతలకాయల స్థానాల సైతం తెదేపా మడతపెట్టిందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. మూడో విడతతో వైకాపాకు మూడనుందని దుయ్యబట్టారు.

Nara Lokesh challenges Jagan
జగన్​కు సవాల్ విసిరిన నారా లోకేష్

By

Published : Feb 14, 2021, 12:34 PM IST

రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో వైకాపాలోని పెద్ద త‌ల‌కాయ‌ల స్థానాలను తెలుగుదేశం మడతపెట్టిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తెలుగుదేశం కార్యక‌ర్త నుంచి కార్యద‌ర్శి వ‌ర‌కూ వెన్నుచూప‌ని పోరాటంతోనే పంచాయ‌తీల్లో ప‌ట్టు సాధించామన్నారు. బెదిరించి ఏక‌గ్రీవాలు చేసుకోవ‌డం, చంపేస్తామ‌ని హెచ్చరించి విత్‌డ్రా చేయించ‌డమూ విజ‌య‌మేనా అని లోకేష్ నిలదీశారు. జ‌నం ఇంకా వైకాపా వైపే ఉన్నారని న‌మ్మకం, ద‌మ్ము ఉంటే అధికార ‌దుర్వినియోగం చేయ‌కుండా.. 3,4 విడత‌ల్లో పోటీ చేయాలని ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని సవాల్ విసిరారు.

ఇదీ చదవండి: కర్నూలు రోడ్డు ప్రమాదంపై.. చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి

ABOUT THE AUTHOR

...view details