జగన్ పాలనలో నేతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. కరోనా, వర్షాలతో చేనేత రంగంలో సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి పరిధిలో 2,490 మగ్గాలు ఉన్నాయని, పరోక్షంగా 50 వేల మంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. 6 నెలలుగా పనిలేక వేతనాల్లేని నేత కార్మికులను ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
పట్టణంలో 284 మందికే నేతన్న నేస్తం అందించారని, సొంత మగ్గం ఉన్నవారికే నేతన్న నేస్తం అంటూ మెలిక పెట్టి, వేలాది మంది నేతన్నలను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కష్టాలకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు..