ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CHANDRABABU: తెదేపా నేతల అరెస్టు అక్రమం.. పోలీసులపై చర్యలు తీసుకోండి - cbn on police arresting tdp leaders

గుంటూరులో దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తప్పుపట్టారు. ఇది మానవ హక్కులను కాలరాయడమేనని.. సీఎం నేరస్తులను పట్టుకోవడంలో శ్రద్ధ చూపాలని సవాల్​ విసిరారు.

తెదేపా నేతల అరెస్టు అక్రమం
తెదేపా నేతల అరెస్టు అక్రమం

By

Published : Aug 16, 2021, 3:13 PM IST

హత్యకు గురైన విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన తెదేపా నేతలపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. రమ్యకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీతానగరం గ్యాంగ్ రేప్ నేరస్తుడు వెంకటరెడ్డిని పట్టుకోవండంలో సీఎం జగన్ ప్రతాపం చూపించాలని సవాల్‌ విసిరారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజునే గుంటూరులో పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ హత్యకు గురైన ఇంజనీరింగ్​ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా నేతలు లోకేశ్​, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్రలపై పోలీసుల దౌర్జ్యన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు, ప్రజాస్వామ్య విలువలకు గండికొట్టేదిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే హత్య జరగగా దిశ యాప్ ఏం చేస్తుందని.. సీసీ కెమెరాలు ఏమయ్యాయని ధ్వజమెత్తారు. గుంటూరు నడిబొడ్డునే సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటే ముఖ్యమంత్రికి మహిళల రక్షణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమౌతోందని దుయ్యబట్టారు. తెదేపా నాయకులపై దౌర్జన్యం చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details