శ్రమజీవులైన కార్మికులు సంక్షేమంతో వర్ధిల్లినప్పుడే సమాజ ప్రగతి సాధ్యమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అధైర్యపడకుండా అందరం కరోనాను జయిద్దామన్న చంద్రబాబు...., కార్మిక, కర్షక, శ్రామిక సోదరులందరికీ ట్వీట్టర్ వేదికగా మేడే శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా కార్మికులకు అండగా ఉండి పోరాడుతుందని హామీ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా మేడే శుభాకాంక్షలు తెలిపిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తమ కష్టంతో జాతిసంపదను పెంచే కార్మికులు, శ్రామికుల సంక్షేమాన్ని విస్మరించి ప్రపంచంలో ఏ సమాజమూ ముందుకు పోలేదన్నారు. అందుకే మేడే అన్నది విశ్వవ్యాప్త వేడుకైందని కొనియాడారు. గతంలో తాను మంత్రిగా మొదటి సంతకాన్ని ఉపాధి హామీ చట్టం కింద 30లక్షల శ్రామిక కుటుంబాలకు లబ్దిచేకూర్చే దస్త్రంపై చేసినట్లు గుర్తుచేశారు. వచ్చే రోజుల్లోనైనా కార్మికులకు, శ్రామికులకు మంచి జరగాలని కోరుకుంటూ మేడే శుభాకాంక్షలు తెలిపారు.
కార్మిక, కర్షకులకు చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు - నారా లోకేష్ ట్విట్ట్ తాజా వార్తలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్ వేదికగా కార్మిక, కర్షకులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కార్మికులకు కన్నీళ్లే మిగిల్చిందన్న చంద్రబాబు వచ్చే మే డే నాటికి కార్మికులంతా ఆర్ధికంగా పుంజుకోవాలని ఆకాంక్షించారు.
మే డే శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేష్