చిన్నారులందరికీ తెదేపా అధినేత చంద్రబాబు జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వర్తమానాన్ని త్యాగం చేస్తేనే.. మన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పారను ఆయన గుర్తు చేశారు. ఎయిడెడ్ పాఠశాలల ఆస్తుల కోసం విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేసే పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందని విమర్శించారు.
గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలల హక్కుల పరిరక్షణ కోసం ‘భారత యాత్ర’ చేపట్టిన కైలాశ్ సత్యార్థితో పాటుగా రాష్ట్ర వీధుల్లో పాదయాత్ర చేశానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం మళ్ళీ మళ్ళీ రోడ్డు మీదకు వస్తానని ఆయన అన్నారు. ప్రపంచంలోని అత్యంత విలువైన వనరులు బాలలేనని, వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత అందరిదని చంద్రబాబు స్పష్టంచేశారు.