శాసనసభలో వైకాపా ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదన్న ఆమె..ఇతరుల వ్యక్తిత్వాన్ని ఎవరూ కించపరచకూడదన్నారు. చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్న తనను విలువలతో పెంచారని..,నేటికీ అవే విలువలు పాటిస్తున్నామన్నారు. విలువతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.
"అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలను ఖండించిన అందరికీ ధన్యవాదాలు. నా అవమానాన్ని మీ తల్లి, సోదరికి జరిగినట్లు భావించారు. నాకు అండగా నిలబడిన వారిని జీవితంలో మర్చిపోలేను. చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్న విలువలతో పెంచారు. నేటికీ అవే విలువలు పాటిస్తున్నాం. విలువతో కూడిన సమాజం కోసం అందరూ కృషిచేయాలి. కష్టాల్లో, ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని ఎవరూ కించపరచకూడదు. నాకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదని ఆశిస్తున్నా."- నారా భువనేశ్వరి, చంద్రబాబు సతీమణి