Nampally court latest news: ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి కుట్ర పన్నిన కేసులో నిందితుడు అబ్దుల్ అజీజ్‌కు తెలంగాణలోని నాంపల్లి కోర్టు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ మెహదీపట్నం ప్రాంతానికి చెందిన అబ్దుల్ అజీజ్ 2001లో రెండు వర్గాల మధ్య వైరుధ్యం సృష్టించేందుకు కుట్ర పన్నాడు. అందులో భాగంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో.. అజీజ్‌ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రభుత్వాస్తుల ధ్వంసానికి కుట్ర.. 16 ఏళ్ల జైలు శిక్ష - హైదరాాబాద్ తాజా నేర వార్తలు
Nampally court latest news: ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి కుట్ర పన్నిన కేసులో ఓ నిందితుడికి తెలంగాణలోని నాంపల్లి కోర్టు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటు రూ.26 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
అస్తుల ధ్వంసం కేసులో శిక్ష
అతని వద్ద నుంచి బెల్జియం తుపాకీతో పాటు 5 తూటాలు, డిటోనేటర్లు, నకిలీ పాస్‌పోర్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు అబ్దుల్ అజీజ్‌కు 16 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు 26 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి:Viveka Case: వివేకాను ఎవరు హత్య చేశారో వారికి తెలుసు: బీటెక్ రవి