ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SP Ranganath: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలను ఖండించిన.. తెలంగాణ ఎస్పీ - నల్గొండ ఎస్పీ

ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ycp mp vijaya sai reddy) చేసిన వ్యాఖ్యలను.. నల్గొండ ఎస్పీ రంగనాథ్​(nalgonda sp ranganath)​ ఖండించారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటాననడం నిరాధారమని స్పష్టం చేశారు. పోలీసులకు దురుద్దేశాలు ఆపాదించవద్దని సూచించారు. గంజాయి నివారణకు అందరూ కలిసి పనిచేయాలని ఎస్పీ రంగనాథ్‌ కోరారు.

విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి

By

Published : Oct 28, 2021, 9:57 PM IST

ఏపీకి సరిహద్దుగా ఉన్న తెలంగాణలోని ఓ జిల్లా పోలీసు అధికారిపై.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ycp mp vijaya sai reddy) చేసిన వ్యాఖ్యలపై నల్గొండ ఎస్పీ రంగనాథ్​(nalgonda sp ranganath) స్పందించారు. తనను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసినట్టు భావించిన రంగనాథ్​.. వాటిని ఖండించారు. ఈ మేరకు ఎస్పీ రంగనాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

పోలీసులకు రాజకీయాలు ఆపాదించొద్దు..
ఏవోబీ నుంచి గంజాయి రవాణా అవుతున్నందునే.. ప్రత్యేక ఆపరేషన్ ద్వారా తమ పోలీసుల్ని అక్కడకు పంపించామని స్పష్టం చేశారు. ఇప్పటికే నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏవోబీలో గంజాయి సమస్య ఇవాళ్టిది కాదని.. గత 15 ఏళ్లుగా నిరంతరాయంగా సాగుతున్నదేనని గుర్తుచేశారు. పోలీసులకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని.. అందరూ గంజాయి నిర్మూలనకు పాటుపడాలని రంగనాథ్​ కోరారు.

ఆ ఆరోపణలు నిరాధారం..

"చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటాననటం నిరాధారం. పోలీసులకు దురుద్దేశాలు ఆపాదించవద్దు. ఏవోబీలో గంజాయిసాగు అందరికీ తెలిసిందే. పక్కా సమాచారం మేరకే ఏవోబీలో దాడులు చేశాం. నల్గొండలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి నివారణకు అందరూ కలిసి పనిచేయాలి." -రంగనాథ్‌, నల్గొండ ఎస్పీ, తెలంగాణ

ఇదీ చదవండి:Ayyanna:విజయసాయికి జగన్ గొడ్డలి వేటు ముప్పు.. అందుకే అక్కడ దాక్కున్నారు: అయ్యన్న

ABOUT THE AUTHOR

...view details