ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమెరికాలో తెలంగాణ వాసి సజీవదహనం - america latest news

తెలంగాణలోని నల్గొండ జిల్లా వాసి అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందారు. 22 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన అతను.. న్యూజెర్సీ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసేవాడని మృతుడి బంధువులు చెప్పారు.

Nalgonda district resident dies in America news
అమెరికాలో తెలంగాణ వాసి సజీవదహనం

By

Published : Dec 29, 2020, 3:51 PM IST

తెలంగాణలోని నల్గొండ జిల్లా వాసి.. అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందారు. కారులో మంటలు చెలరేగి దేవేందర్‌రెడ్డి(45) సజీవదహనమయ్యారు. దేవేందర్‌రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కర్నాటిపల్లి. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా దేవేందర్‌రెడ్డి పనిచేస్తున్నారు. తెరాస ఎన్‌ఆర్‌ఐ విభాగంలో సభ్యుడిగా ఉన్నారు.

ఎన్​ఆర్​ఐ దేవేందర్‌రెడ్డి మృతితో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కర్నాటిపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. అతని కుటుంబసభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. దేవేందర్‌రెడ్డి 22 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారని మృతుని బంధువులు పేర్కొన్నారు. మృతుడికి 7 సంవత్సరాల కూతురు ఉందని వెల్లడించారు. న్యూజెర్సీ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు.

అమెరికాలో తెలంగాణ వాసి సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details