దేశ సార్వభౌమత్వానికే మాయని మచ్చలా తిరుపతి ఉపఎన్నిక నిలిచిందని నక్కా ఆనంద బాబు ధ్వజమెత్తారు. తన దొంగ ఓట్ల ప్రణాళికను తెదేపా బయటపెట్టడంతో మంత్రి పెద్దిరెడ్డి ముఖం మాడిపోయిందని దుయ్యబట్టారు. తాను సృష్టించిన దొంగ ఓటర్లను సిగ్గులేకుండా భక్తులంటూ వెనకేసుకొచ్చారని నక్కా మండిపడ్డారు. గెలుపు కోసం దొంగ ఓటర్లను నమ్మకున్నవారు.. భవిష్యత్ లో ఎంతకైనా తెగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే తిరుపతి ఉపఎన్నికను రద్దుచేయాలని నక్కా ఆనంద బాబు డిమాండ్ చేశారు.
'దొంగ ఓట్లతో జరిగిన తిరుపతి ఉపఎన్నికను దేశమంతా చూసింది'
ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేలా తిరుపతి ఉపఎన్నిక నిర్వహించారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు విమర్శించారు. నకిలీ ఓటర్ కార్డులు, దొంగఓటర్లతో జరిగిన తిరుపతి ఉపఎన్నికను దేశమంతా చూసిందన్నారు.
'దొంగ ఓట్లతో జరిగిన తిరుపతి ఉపఎన్నికను దేశమంతా చూసింది'