నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో మట్టి మాఫియాను ప్రశ్నించిన ఎస్సీ నాయకుడు కరకటి మల్లిఖార్జునపై వైకాపా గూండాలు దాడి దుర్మార్గమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు.
'మట్టి మాఫియాను ప్రశ్నించిన ఎస్సీ నాయకులపై దాడి దుర్మార్గం' - ఎస్సీ నాయకులపై దాడి చేయటం దుర్మార్గమన్న నక్కా ఆనంద్‌బాబు
నెల్లూరు జిల్లాలో మట్టి మాఫియాను ప్రశ్నించిన ఎస్సీ నాయకునిపై వైకాపా గుండాల దాడి దుర్మార్గమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా అనంద్ బాబు ధ్వజమెత్తారు.
"అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో అనధికకారికంగా రూ. వందల కోట్ల మట్టి మాఫియా నడుస్తోంది. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డే ఈ మాఫియాను నడుపుతూ, చెరువుకట్టలు, వాగులు, వంకలు తేడా లేకుండా మట్టిని తవ్వి అమ్మేస్తున్నారు. ప్రశ్నించిన మల్లిఖార్జునపై ఈ నెల 16న వైకాపా గూండాలు దాడి చేయటంతో పాటు అక్రమ కేసులు నమోదు చేయించారు. పోలీసులు దాడి చేసిన వారిని వదిలి బాధితుడిపై కేసు పెట్టడం దుర్మార్గం. గత నెల రోజుల్లో 15మంది ఎస్సీ యువకులపై ఇదే తరహాలో అక్రమ కేసులు పెట్టారు. పెద్ద ఎత్తున మట్టి, గ్రావెల్ మాఫియా రెచ్చిపోతున్నా జలవనరులు, రెవెన్యూ, పోలీసు విభాగాలు పట్టించుకోకపోగా మాఫియాకు సహకరిస్తున్నాయి" అని ఓ ప్రకటనలో ఆరోపించారు.
ఇదీ చదవండి: