Nakka Anand Babu On Lecturer jakaraiah suicide Incident:ప్రభుత్వం వ్యవస్థలను ఎంతగా నాశనం చేసిందో చెప్పటానికి దళిత లెక్చరర్ జకరయ్య ఆత్మహత్యే నిదర్శనమని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆత్మహత్యకు పాల్పడిన లెక్చరర్ జకరయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. ఎయిడెడ్పై ప్రభుత్వ విధానమే జకరయ్యను పొట్టన పెట్టుకుందని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వ అడ్డగోలు విధానాలతో ఎయిడెడ్ ఉపాధ్యాయులు, లెక్చరర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆక్షేపించారు.
సీఎం జగన్ చర్యలతో ఎయిడెడ్ జూనియర్, డిగ్రీ కాలేజీలలోని దాదాపు 2 వేల మంది లెక్చరర్లు, పాఠశాలలోని 7 వేల మంది టీచర్లు రోడ్డున పడతారని ఆనాడే హెచ్చరించామన్నారు. దళిత లెక్చరర్ జకరయ్య సూసైడ్ నోటును పోలీసులు తారుమారు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలీసులు చెబుతున్నట్లు అతను అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుంటే నోటును వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే..