ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంజినీరింగ్ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు అరెస్టు - divya tejaswini murder case

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స్పష్టించిన విజయవాడలో ఇంజినీరింగ్ యువతి హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 22 రోజుల నుంచి జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న అతన్ని శుక్రవారం వైద్యులు డిశ్ఛార్జి చేశారు. ఆ వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

divya tejaswini case
divya tejaswini case

By

Published : Nov 6, 2020, 11:17 PM IST

విజయవాడలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సెప్టెంబర్‌ 15వ తేదీన కత్తితో యువతిపై దాడి చేసిన నిందితుడు... అనంతరం అదే కత్తితో తాను గాయపరచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో విద్యార్థిని చనిపోగా.... తీవ్ర గాయాలైన నిందితుడిని పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. దాదాపు 22 రోజుల తర్వాత నాగేంద్రబాబు పూర్తిగా కోలుకున్నాడని భావించిన వైద్యులు శుక్రవారం డిశ్ఛార్జి చేశారు. వెంటనే పోలీసులు నిందితుడు నాగేంద్రను అరెస్టు చేసి ప్రత్యేక వాహనంలో విజయవాడకు తీసుకువచ్చారు.

నాగేంద్రబాబుని కోర్టులో హాజరుపరిచేందుకు 24 గంటల సమయం ఉండటంతో దిశ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలను రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. శనివారం ఉదయం నిందితుడిని కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను ఇప్పటికే సేకరించటంతో పాటు, ఛార్జిషీట్​ను వారం రోజులలోపే సిద్ధం చేశారు. అయితే ఈ కేసులో పలు అంశాలపై పోలీసులకు ఇంకా స్పష్టత లేదు. ఈ క్రమంలో నాగేంద్రబాబును విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details