సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ.9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచటమా? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మద్యంపై వచ్చే ఆదాయం గతంలో కంటే భారీగా పెరిగిన విషయాన్ని మనోహర్ ట్వీట్ చేశారు. మద్యం ద్వారా వచ్చిన రాబడిని చూపించి రూ.8 వేల కోట్ల ప్రభుత్వ బాండ్లు అమ్ముతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ 'స్పిరిటెడ్ విజనరీ' మేనిఫెస్టో అమలు ఇదేనా? అంటూ చురకలంటించారు. మద్యం ద్వారా అధిక ఆదాయం సంపాదించటంతోపాటు అప్పు కూడా పొంది జాక్పాట్ కొట్టారని నాదెండ్ల ఎద్దేవా చేశారు.
మద్య నిషేధం అంటే.. 22 వేల కోట్లు పిండుకోవడం : జనసేన - నాదెండ్ల న్యూస్
మద్యం ఆదాయంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. మద్యపాన నిషేధమంటే మద్యం ఆదాయం రూ.22 వేల కోట్లకు పెంచటమా? అని ప్రశ్నించారు. 'స్పిరిటెడ్ విజనరీ' జగన్ మేనిఫెస్టో అమలు తీరు ఇదేనని ఎద్దేవా చేశారు.
మద్యపాన నిషేధమంటే ఇదేనా?