తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తైంది. సాగర్ ఉపఎన్నికకు మొత్తం 77 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన అధికారులు.. 17 నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. మిగతావారి నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు వివరించారు.
తెలంగాణ: సాగర్ నామినేషన్ల పరిశీలన పూర్తి... 17 తిరస్కరణ - nagarjuna sagar by election campaign
తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికలో భాగంగా నామినేషన్ల పరిశీలన పూర్తైంది. మొత్తం 77 మంది నామపత్రాలు సమర్పించగా... అందులో 17 నామినేషన్లు తిరస్కరణకు గురైయ్యాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ స్థానానికి పోటీలో 60 మంది ఉండగా... ఉపసంహరణకు ఏప్రిల్ 3 వరకు గడువుంది.

నాగార్జునసాగర్ ఎన్నికకు నామినేషన్ల సంఖ్య, సాగర్ నామినేషన్ల పరిశీలన పూర్తి
నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3 దాకా గడువు ఉంది. ఏప్రిల్ 17న సాగర్ పోలింగ్ జరగనుండగా... మే 2న ఫలితం తేలనుంది.
ఇదీ చూడండి:తిరుపతి ఉపఎన్నిక: ప్రచారంలో దూసుకెళ్తున్న అభ్యర్థులు