ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Nagababu: భీమవరంలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు - నాగబాబు తాజా వార్తలు

NAGABABU TWEET: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో మా అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించిన.. మహా నటులందరికీ నా అభినందనలు అంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సినీనటుడు కొణిదెల నాగబాబు ట్వీట్‌ చేశారు.

NAGABABU TWEET
NAGABABU TWEET

By

Published : Jul 7, 2022, 1:44 PM IST

NAGABABU TWEET: ‘మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది. ఆ మహానుభావుడికి నా నివాళి. ఆ సభలో మా అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారు. ఆ మహా నటులందరికీ నా అభినందనలు’ అంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సినీనటుడు కొణిదెల నాగబాబు బుధవారం రాత్రి ట్వీట్‌ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సోమవారం స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి రోజా తదితరులు పాల్గొన్నారు. దీనిపై నాగబాబు తాజాగా ట్విటర్‌లో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details