న్యాక్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి తెలిపారు. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేసే అంశం పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో జి. శంకరయ్య అధ్యక్షతన జరిగిన న్యాక్ ఉద్యోగుల ప్రథమ మహాసభలో గౌతమ్ రెడ్డి మాట్లాడారు.
'న్యాక్ ఉద్యోగులను రెగ్యులర్ చేసే అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తాం' - National Academy of Construction latest news
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) సంస్థలోని ఉద్యోగులను రెగ్యులర్ చేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్లో జి. శంకరయ్య అధ్యక్షతన జరిగిన న్యాక్ ఉద్యోగుల ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు న్యాక్ పరిధిని విస్తరించి, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నారని గుర్తు చేశారు. కానీ ఆయన మరణానంతరం వచ్చి ముఖ్యమంత్రులెవరూ ఈ సమస్య గురించి పట్టించుకోకపోవటం దారుణమన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత సచివాలయ వ్యవస్థ ద్వారా నాలుగు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కార్మికులు, ఉద్యోగులకు కనీస వేతనం కల్పించడంలో కృషి చేస్తున్నారన్నారు.
ఇదీ చదవండి:YSR_BHIMA: వైఎస్సార్ బీమా పథకంలో మార్పులు... జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమలు