'సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది' - muslim unions latest news in vijayawada
సీఏఏ, ఎన్ఆర్సీలు రాష్ట్రంలో అమలు కాకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. విజయవాడలో ముస్లిం సంఘాలు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం సంఘాలతో పాటు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైకాపా నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, సీపీఎం రాష్ట్ర నాయకుడు సీహెచ్ బాబూరావు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మల్లాది విష్ణు తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ చట్టాలు రాష్ట్రంలో అమలు కాకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు తెలిపారని ఆయన స్పష్టం చేశారు.